నేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల
తిరుపతి.
చిట్యాల. నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తేదీ 23/01/2024 రోజున ఉ,, 11 గంలకు ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* మాట్లాడుతూ చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు బూతు స్థాయి కన్వీనర్లు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పిఎసిఎస్ డైరెక్టర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ , యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య స్థానిక ఎంపిటిసి దబ్బెట అనిల్ చిట్యాల మండల ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ నాయకులు బొట్ల రాజు , డాక్టర్ కిషన్ చిట్యాల టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..