చందుర్తి, నేటిదాత్రి :
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నర్సింగపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొబ్బల శంకర్, అనారోగ్యంతో మరణించిన పాకనటి చంద్రయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
