
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ / డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. (డి ఎన్ ఆర్ )యువసేన ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్ మంగళవారం రోజు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. మండలంలోని రాచాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక,పల్లె ప్రకృతి వనంను, గుడిగాని పల్లి గ్రామంలో నూతనంగా వేసిన సిసి రోడ్డును, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జడ్చర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాలను అభివృద్ధి పథంలో నడిపించడమే జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊరుకొండ ధ్యాప నిఖిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.