మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి
కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని చింతకుంట తండాలో
నూతన నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. లాంచనంగా ప్రారంభించారు. అనంతరం గుండేడు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ యువకులు, తదితరులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చబోతుందని అన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా త్వరలోనే రేషన్ కార్డులు, కొత్త ఇండ్లు, పింఛన్లు, రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేసి చూపిస్తుందని అనిరుధ్ రెడ్డి. భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు కలిసిమెలిసి జీవించాలని అందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు గ్రామ పరిపాలనను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామపంచాయతీలో ప్రజలను పాలనపరంగా పెట్టిందని, చిల్లిగవ్వ బిల్లులు చెల్లించక సర్పంచులకు గ్రామస్తులకు ముప్పు తిప్పలు పెట్టారని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొలువుదిరిందని అందరికీ అన్ని సౌకర్యాలను సమకూర్చుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ అధ్యక్షులు
మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.