MLA Anirudh Reddy Distributes Sarees to SHG Women
చీరలను పంపిణీ చేసిన.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి”
బాలానగర్ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మల్ల అశ్విని, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనాథ్ నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, సహాయక ప్రాజెక్టు మేనేజర్ తిరుపతయ్య, ఎంపీఓ విజయ కుమారి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
