
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో యాదగిరికుంట ప్రాంతంలో పంట పొలంలో మిషన్ భగీరథ పైపు దర్శనమిచ్చింది, గ్రామంలో యాదరి కుంట ప్రాంతంలో ఓ రైతు మిషన్ భగీరథ పైపును వ్యవసాయ క్షేత్రంలో నీటి కోసం వినియోగించగా అక్కడి రైతులు విషయాన్ని తెలుసుకుని మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇవ్వగా మిషన్ భగీరథ సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించారు, మిషన్ భగీరథ పైపును పంట పొలానికి వినియోగించిన రైతుపై చర్యలు తీసుకుంటామన్నారు.