మిస్సయిన యువకుని మృతదేహం లభ్యం…
నూగూర్ వెంకటాపురం ఏప్రిల్ 29(నేటి దాత్రి ):-
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జక్కుల వారి విధికి చెందిన వాసం రవికిరణ్ (40) తండ్రి కన్నయ్య (లేటు ), కులం కోయ, వృత్తి మిషన్ భగీరథ వాటర్ వాల్ ఆపరేటర్ గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఇంట్లో నే ఉంటూ మిషన్ భగీరథ నీళ్లు వదులుతూ ఉండేవాడు.ఐదు రోజుల క్రితం గురువారం నాడు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయలు దేరి మిషన్ భగీరథ నీళ్లు వదలి వస్తానని అతని తల్లి అయినా వాసం సాలమ్మ తో చెప్పి తన మోటార్ సైకిల్ తీసుకోని దేరాడు. తన కొడుకు ఇంటికి రాక పోయేసరికి తల్లి వాసం సాలమ్మ అన్ని చోట్ల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించక పోవడం తో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు పిర్యాదు చేసింది. స్థానిక ఎస్సై కె తిరుపతి రావు వాసం సాలమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా వాసం రవికిరణ్ తన ఆరోగ్యం బాగాలేనప్పటికి మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమీ లో ఇంటి నుండి బయటకు వెళ్లడం వలన వడదెబ్బకు గురై అస్వస్థత చెంది వి. ఆర్. కె పురం గ్రామ శివారు లోని పాలెం వాగు ప్రాజెక్టు కాలువ సమీపంలో పడి పోయినట్లు తెల్సింది. ఆ ప్రదేశం నిర్మాన్యూస్య ప్రదేశమై ఎవరు చూడకపోవడం తో మృతుడు మరణించినట్లు గా ప్రాథమిక విచారణ లో తెలుస్తుందని అన్నారు. మృత దేహాన్ని తన తల్లి వాసం సాలమ్మ గుర్తించగా ఆమె వాంఘ్ములం మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.