ధ్రువీకరణ పత్రాలకు తప్పుని తిప్పలు
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయంలో ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. సంక్షేమ పథకాలకు కుల, రాబడి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయని ధ్రువీకరణ పత్రాల కోసం తాహాసిల్దార్ కార్యాలయం కి వెళ్తే అక్కడ గిర్ధావర్ లు పెండ్లి అయి 10 సంవత్సరాలు అయినా కూడా కుల ధ్రువీకరణ కోసం తమ అమ్మవారి ఇంటి పేరు తో కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని నిక్కట్టుగా చెప్తున్నారు. ఈ పదేళ్లలో అమ్మవారి ఇంటికాడ నుండి సర్టిఫికెట్లన్నీ మెట్టినింటి కి మారిన సర్టిఫికెట్లు చూపెట్టిన ఫలితం లేకుండా పోతుంది. తప్పనిసరిగా పెండ్లి అయి ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పుడు అమ్మగారి ఇంటి పేరు చెక్ చేయాల్సిందే అంటున్నారు. గతంలో చేసిన అధికారులు ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా చేశారా?గతం లో ఉన్న గిర్ధవర్లె ఆ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేశారని మర్చిపోయారా? లేకపోతే ప్రజలను గిర్దవర్ లు కావాలని ఇలా చేస్తున్నారా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.