బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డిని గెలిపించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించాలని భూపాలపల్లి రూరల్ గ్రామాలలో నాగారం రాంపూర్ ,కమలాపూర్ గ్రామాలలో ముస్లిం మైనార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు భూపాలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీ ప్రజలకు జరిగినటువంటి లాభాన్ని గెలవడం ద్వారా రాబోయేటువంటి ప్రయోజనాలను ప్రజలకు సంక్షిప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం మాట్లాడుతూ ముస్లిం, ప్రజానికం, అందరూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ని కోరుకునే బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ముస్లిం మైనారిటీలు వేరే ఇతర ఏ పార్టీల యొక్క ప్రలోభాలకు లొంగరని 100కు 100% బిఆర్ఎస్ వైపే అందరి చూపు ఉందని తెలియజేయడమైనది ఈనెల 19వ తారీకు జయశంకర్ భూపాలపల్లి యందు ఆదివారం రోజున జరగబోవు జిల్లా మైనారిటీ సదస్సును అధిక సంఖ్యలో మైనారిటీలు వచ్చి విజయవంతం చేయగలరని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మైనారిటీ డిస్టిక్ ప్రెసిడెంట్ కరీం జడ్పీ కో ఆప్షన్ యాకుబ్ ముస్లిం సేవా సమితి అధ్యక్షుడు ఎస్కే సాదిక్ పాషా బిఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు అశ్రఫ్ అలీ నాయకులు అబ్దుల్ అజీమ్, చాంద్ పాషా ఇమ్రాన్ నాగారం గ్రామానికి చెందినటువంటి మండల కో ఆప్షన్ ,పాషా నాయకులు యూసుఫ్ ,నౌ ఫిల్ కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి ఉపసర్పంచ్ షబానా తహెముర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అన్వర్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు