
MLA Yennam Srinivas Reddy
ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధ్యక్షతన మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాల అధికారులతో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు, సీజనల్ అంటు వ్యాధులు, భూభారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై గౌరవనీయులు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ దామోదర్ రాజనర్సింహ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ఇంచార్జీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, డాక్టర్ పర్ణికా రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ మోహన్ రావు , మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.