హైదరాబాద్, సెప్టెంబర్: తెలంగాణ రాష్ట్రంలో కులాలు ఆత్మగౌరవంతో ముందుకుసాగాలనే సమున్నత లక్ష్యంతో తమ ప్రభుత్వం ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలను కేటాయించి భవనాలు సైతం నిర్మిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం కొకాపేట లో సగర (ఉప్పర) కుల సంఘానికి చెందిన ఆత్మగౌరవ భవనానికి మంత్రి మహేందర్ రెడ్డి తో కలిసి భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ ఆస్కాని మారుతి సాగర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణ బద్ధుడై అనేక కుల సంఘాలకు కోకాపేట తో పాటు ఉప్పల్ భగాయత్ లో ఎకరాల చొప్పున స్థలాలను కేటాయించి భవన నిర్మాణాలకు కొట్లాది రూపాయలు కేటాయించారని అన్నారు. భవన నిర్మాణరంగ కార్మికులుగా జీవించే సగరులకు కోకాపేటలో కుల సంఘ భవనం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలాన్ని రెండు కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ మొత్తంతో వీలైనంత త్వరగా చక్కటి భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. సగరుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బీసీ బందు లాంటి పథకాన్ని పెట్టి అందులో సగరులకు అవకాశాన్ని కల్పించి వారి ఆర్థిక పురోగతికి కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరో అతిథిగా పాల్గొన్న భూగర్భ గనులు, సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు పెద్దపీట వేస్తూ వారికి కావలసిన అన్ని వసతులను కల్పిస్తూ వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుందని అన్నారు. భవన నిర్మాణరంగ కార్మికులుగా జీవించే సగరులకు ప్రభుత్వ నిర్మాణ పనుల్లో తగు శాతం ప్రత్యేక రిజర్వేషన్ వాటా కల్పించే విషయంలో, ధరావతు సొమ్ము లేకుండా కాంట్రాక్టులు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడుతాను అన్నారు. బీసీల సంక్షేమం కోసం వెయ్యికి పైకి గురుకులాలను పెట్టిన ఈ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ సంచార జీవనం సాగించే సగరులు ప్రస్తుతం బీసీ డీ గ్రూప్ ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం నియమించిన తమ కమిషన్ ఇప్పటికే ఇలాంటి కులాల ఆర్థిక స్థితిగతులు, వారి జీవన విధానాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక అధ్యయనం చేస్తుందని అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఏ గ్రూప్ లో ఉండాలనే విషయమై కమిషన్ రిపోర్ట్ సమర్పించనున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గొరక్క సత్యం సగర, రాష్ట్ర నాయకులు ముత్యాల హరికిషన్ సగర, ఆర్ బి ఆంజనేయులు సగర, కె.పి రామ్ సగర, శ్రీరాల శ్రీరాములు సాగర్, బంగారి నర్సింహ సగర, యాదాద్రి సగర అన్నదాన సత్ర సంఘం అధ్యక్షులు కే.పి రాములు సగర, శ్రీశైలం సగర అన్నదాన సత్ర సంఘం అధ్యక్షులు పడమటి కృష్ణయ్య సగర, సంఘం నాయకులు ఉదయ్ సాగర్, జిల్లాల అధ్యక్షులు మోడల తిరుపతయ్య సగర, ప్రణీల్ చందర్ సాగర్, ఉప్పరి రవి సాగర్, వెంకటేష్ సగర, అంజనేయులు సగర, భాస్కర్ బాబు సగర, లక్మణ్ సగర, సూరంపల్లి కృష్ణ సగర, నర్సింహ్మ సగర, కృష్ణ సగర, మురళీకృష్ణ సగర, సమ్మయ్య సగర, అశోక్ సగర, లక్ష్మణ్ సగర, సురేష్ సగర, మల్లేష్ సగర, రమేష్ సగర, ఏరుకొండ ప్రసాద్ సగర, సాయికుమార్, శంకర్ రాకలే, నాయకులు ఆస్కాని వెంకటస్వామి సాగర్, మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి,స్రవంతి,పల్లవి,అమృత,కుసుమ,సువర్ణ సాగర్,యువజన సగర సంఘం అధ్యక్షులు పెద్దబూదుల సతీష్ సాగర్,సురేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.