గడ్డం వంశీ నీ భారీ మెజారిటీతో గెలిపించాలి మంత్రి శ్రీధర్ బాబు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో మే మూడవ తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ పరిశ్రమలు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిపిస్తారని మాకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు , వీరి వెంట ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ మరియు పిసిసి కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు మరియు గెల్లు శ్రీనివాస్ గాజుల విజయ్ మేకల సంతోష్ తదితరులు పాల్గొన్నారు