
KGBV Junior College Inaugurated in Bhupalpally
కేజీవిబి జూనియర్ కళాశాల భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంబోత్సవం,
మండలంలోని వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన విద్యాబోధనకు డీఎస్సీ నిర్వహించి
టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు
కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను ఆంగ్లమాద్యమంలో చదివానని, నాలాగే విద్యార్థులు ఇంగ్లీష్ లో చదవాలని, బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు.
గ్రామంలో ఒక్కరు చదువుకున్నా … వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు.
10 వతరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏ.ఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,
ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈ.జి.ఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాపు, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, డీఈఓ రాజేందర్, ఈ ఈలు, కెజిబివి ఎస్ ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.