ఆనంద నిలయం లో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

పేద ప్రజల ఆశాజ్యోతి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య

మంచిర్యాల నేటిదాత్రి

నేతకాని (మహార్) సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని సందర్భంగా మంచిర్యాల సమీపంలో ని తోళ్లవాగు ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ని ఆనంద నిలయం లోని వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతకాని(మహార్) సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల, ఆశాజ్యోతి ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఇంకా ఎందరికో సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని కోరారు. వారి అడుగుజాడలలో మేము మరిన్ని సేవ కార్యక్రమాలను చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
జాడి నర్సయ్య నేతకాని (మహార్)రాష్ట్ర అధ్యక్షులు, డా” నీలకంటేశ్వర్ సేవాదళ్ నాయకులు, రాజ్ గోపాల్ రావు, శ్రీపాద కన్స్ట్రాక్షన్ బిల్డర్, మార్కండేయ ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు, జుమ్మిడి విశ్వనాథ్ నేతకాని (మహార్) సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాలీమ్ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్, లింగమూర్తి సేవా దళ్, ఎస్. రామారావు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!