శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- లాభాపేక్ష కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేసే ఏకైక సంస్థ ఆర్టీసీ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో ఆర్టీసీ కానిస్టేబుల్ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పెరేడ్ కి పొన్నం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజలతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం పైన కూడా దృష్టి సారించడం జరుగుతుందనీ అందులో భాగంగా విధి నిర్వహణలో మృతి చెందిన 813 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగుం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీని ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణించినట్లు మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం రవాణాశాఖ ఉన్న ఖాళీ ఉద్యోగులు భర్తీ చేయడం తోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేయడం తోపాటు నూతన బస్సులు కొనుగోలు చేయాలని దృక్పథంతో ఉన్నట్లు చెప్పారు. బడ్జెట్లో 900 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని అన్నారు 2300 బస్సులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ వివరించారు.