మంత్రి “పొన్నం”కు సన్మానం
“విశ్వకర్మల” వినతికి “సానుకూలంగా” స్పందించిన మంత్రి
సీఎం “రేవంత్” దృష్టిలో పెట్టి చైర్మన్ ను నియమిస్తామని “పొన్నం” హామీ
“నేటిధాత్రి” కరీంనగర్
కరీంనగర్ పట్టణంలో పద్మనగర్ ఇంద్రభవన్లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మరియు రోడ్ రవాణా శాఖ మంత్రివర్యులు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ కి విశ్వకర్మలు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అందరి సమక్షంలో రాష్ట్ర మంత్రివర్యులకు సన్మానం చేసి వారికి రిప్రెంటేసాన్ ఇవ్వడం జరిగినది విశ్వకర్మలకు గత ఉమ్మడిప్రభుత్వములో 2008 నుండి 2010 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పోరేషన్ మరియు ఫెడరేషన్ ఏర్పాటు చేయనైనది కానీ అట్టి ఫెడరేషన్ కు కార్పొరేషన్ కు చైర్మన్ నియామకము చేయలేదు కావున తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశ్వకర్మలకు అట్టి ఫెడరేషన్ మరియు కార్పొరేషన్ను వెలుగులోకి తీసుకురాలేదు కానీ మళ్ళీ 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ అట్టి జీవోను అధికారికంగా ప్రకటించి మాకు న్యాయం చేయగలరని భావిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ 5 దాయూల కులస్తులము 22,52,000 జనాభా కలిగియున్న ఐదు దాయలము, కమ్మరం, వడ్డంగం, శిల్పి, కంచరం, స్వర్ణ కారం, వృత్తులము కలిగి ఉన్న జనాభా, మాకు ప్రత్యేక ఫెడరేషన్ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అట్టి దానికి చైర్మన్ గా నియామకం చేయగలరని బిసి మంత్రివర్యులను కొరడము జరిగినాధి అందుకు వారు దానికి సానుకూలంగా స్పందించి తెలంగాణ ముఖ్యమంత్రి తో మాట్లాడి వెంటనే అమలు చేపిస్తాను అని మాట ఇవ్వడం జరిగినది అందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన విశ్వకర్మలము వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడము జరిగినది ..
ఈ కార్యక్రమంలో *విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణు* గోపాల చారి ప్రధాన కార్యదర్శి ఉదారం శ్రీనివాసు ఉపా ధ్యాక్షులు, చల్లోజు సత్యనారాయణ, పాములపర్తి దయాసాగర్ ,ప్రచార కార్యదర్శి గుగ్గిళ్ళ చంద్రమౌళి, సలహాదారు హయగ్రీవ చారి, మరియు, గోగులకొండ లక్ష్మయ్య, వనపర్తి కుమారస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామనపళ్లి లక్ష్మీ శంకరాచారి, చెల్పూరు శాంత, లింగం భారతమ్మ ,మరియు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కడార్ల శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి కట్ట జగన్, కోశాధికారి కడార్ల శ్రీనివాస్, కనపర్తి ప్రభాకర్ ,కట్ట ప్రవీణ్, శ్రీనివాస్ ,మరియు విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు గోగులకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాయితోజు బ్రహ్మచారి, డైరెక్టర్లు కూరెళ్ల కేదారి ,వడ్లూరి మల్లేశం, శేఖర్, రవి , కార్యవర్గ సభ్యులు పాల్గొని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..