భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
అక్టోబర్ 09వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలన శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన ఉంటుందని, వారి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు అమలు ఉంటాయని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
సోమవారం రోజున ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకుంటారు.
భూపాలపల్లి లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం,జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం ప్రారంభిస్తారు.
జిల్లా కేంద్రంలో నిర్మించిన 2 ఫేస్ డబల్ బెడ్ రూమ్ లను లబ్దిదారులకు, నూతనంగా వచ్చిన 1100 మంది లబ్దిదారులకు దలితబంధు అమలు పాత్రలను అందిస్తారు.
నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే 3000 గృహాలక్ష్మి వచ్చాయి, ముఖ్యమంత్రి మరో 1500కూడా అదనంగా మంజూరు చేశారు.
మంత్రి కేటీఆర్ పర్యటనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరమణ సిద్దు వైస్ చైర్మన్ హరిబాబు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ పట్టణ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్ధన్ స్థానిక కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టి నాయకులూ పాల్గొన్నారు.