
Culture Minister Jupally Krishna Rao.
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు శ్రీశైలం లో ఆల్ ఇండియా వెలమ సంక్షేమ భవన్ ను మంత్రితో కలిసి ప్రారంభించి, అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు