కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

మెదక్ కు, మన పార్టీకి ముఖ్యమైన ఎన్నికలు. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక ఇది.

అందర్నీ కలుపుకొని పోవాలి. మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. 22 ఏళ్ల అనుబంధం మనది.

పదేళ్ల కింద పపన్నపేట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అందరూ ఆలోచించాలి.

ఎరువులకు, నీళ్లకు, కరెంట్ కు ఎన్ని కష్టాలు పడ్డాము గుర్తు ఉండే ఉంటుంది

సీఎం కేసీఆర్ గారు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు.

ఎమ్మెల్యే పద్మ గారు ప్రజల్లో ఉండి, నియోజక అభివ్రుది కోసం కృషి చేశారు.

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్

మన ఎమ్మెల్యేగా కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ది చేసుకోవచ్చు.

హైదరాబాద్ నుండి బెంజ్ కారులో వచ్చి ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నమ్ముతారా..

రేవంత్ రెడ్డి ఏమన్నడు రైతు బంధు బిచ్చం వేస్తున్నాం అన్నడు

ప్రతి రైతుకూ 15 వేలు అని కుట్ర చేస్తున్నది కాంగ్రెస్. ఎన్ని ఎకరాలు ఉన్నా 15 వేలే ఇస్తారు.

కెసిఆర్ ప్రతి ఎకరాకు 16 వేలు అంటే, కాంగ్రెస్ ప్రతి రైతుకు 15 వేలు అంటున్నది. ప్రజలు ఆలోచించాలి.

5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నాం అని ఒప్పుకొని నెత్తిల పాలు పోసిండు డికె శివకుమార్.

ఛత్తీస్ గడ్ లో కొనేది ఎకరాకు 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే. మిగతా కొనరు. కానీ మన దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేస్తారు.

మనది మంచి మేనిఫెస్టో ప్రజలందరికీ చేర్చాలి.

రైతు బంధు సృష్టికర్త కేసీఆర్, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్

400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము.

రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం గారు ఇవ్వాల్సిందే అన్నారు.

గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇకనుండి పెద్దలకు కూడా సన్నబియ్యం.

రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు మందికి చెయ్యబోతున్నము.

బి ఆర్ ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాం.

ఆసైండ్ ల్యాండ్స్ కి పూర్తి హక్కులు ఇవ్వ బోతున్నం

ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నాం

భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి. మోసపోతే గోస పడదాం.

పదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా చేసుకుందాం.

ఇందిరాగాంధీ వచ్చినప్పటి నుండి జిల్లా చేస్తా అని మాట తప్పారు.

సీఎం కేసీఆర్ గారు కలను సాకారం చేశారు. ఎమ్మెల్యే పద్మ గారు అభివృద్ధి చేశారు.

విష ప్రచారాలు తిప్పి కొట్టాలి మెదక్ లో గులాబీ జెండా ఎగరాలి.

మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పద్మ గారిని గెలిపించాలి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!