
ICICI Bank
ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు
ప్రమఖ ప్రైవేట్ బ్యాంక్ ICICI తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు మెయింటెన్ చేయాలని స్పష్టం చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచేసింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త అకౌంట్లకు వర్తిస్తుంది. ఈ విషయం శనివారం బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది.