చందుర్తి, నేటిధాత్రి:
వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చెందిన గాడ్లోజి చంద్రప్రకాష్ చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన మట్టెల శిరీషను వివాహం చేసుకొని ప్రస్తుతం మల్యాల గ్రామంలోనే జీవనోఫాది నిమిత్తం విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి అయిన కమ్మరి పని, వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రైతుకు ఉపయోగపడే అనేక పరికరాలు చేస్తూ తన ఆలోచనలతో అగ్గిపెట్టెలో పట్టే రైతులు ఉపయోగించే గొడ్డలి, కొడవలి, కొంక, కత్తి వంటి పరికరాలు సూక్ష్మంగా తయారుచేసి అగ్గిపెట్టెలో అమరే విధంగా సైజులో తయారుచేసి గ్రామస్తులను అబ్బుర పరిచారు తను చేసిన పరికరాలను చూసి గ్రామస్తులు అభినందించారు ఉపాధి నిమిత్తం ప్రభుత్వపరంగా ఆదుకోవాలని చంద్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు