సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు
మందమర్రి నేటి ధాత్రి
ఓటమి గెలుపుకు నాంది అని ఓటమెరుగని జీవితంలో కిక్ ఉండదని గెలుపుతో గర్వం పెరుగే అవకాశం ఉందని ఓటమితో వచ్చినటువంటి క్రమశిక్షణ పట్టుదల గెలుపు చిరకాలంగా ఉంటుందని కాబట్టి ఓటమితో కుంగిపోకుండా గెలుపు అనే గమ్యస్థానం చేరుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ అన్నారు.
నేడు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ గెలుపు కోసం సరైన క్రమశిక్షణతో కూడిన సాధన అవసరమని ఆయన అన్నారు.
ఇక్కడ ఎంపిక కాబడ్డ మినీ అండర్ 12 ఇయర్స్ బాల బాలికలు రేపు అనగా 31 /8/ 2025 న హైదరాబాదు లోని మీదని మైదానమందు జరిగేటటువంటి రాష్ట్ర హ్యాండ్ బాల్ సెలక్షన్స్ లో జిల్లా తరపున పాల్గొంటారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం లో హ్యాండ్ బాల్ కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పి ఈ టి. రాధారాణి,
సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్, సంజయ్,రఘు, వర్మ, అమూల్య లు పాల్గొన్నారు.