
INTUC presents
కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్ కి ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేత
మంచిర్యాల,నేటి ధాత్రి:
సింగరేణిలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా సొంతింటి కలను నెరవేర్చాలని,ఆదాయపు పన్నును మాఫీచేయాలని,మెడికల్ అటెండెన్స్ నియమాలను మార్చాలని కోరుతూ గురువారం ఐఎన్టియుసి నాయకులు గని మేనేజర్ కు మల్లారెడ్డి అధ్యక్షతన మెమోరాండం అందజేశారు. అనంతరం కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి మాట్లాడుతూ…నూతన బదిలీ విధానం,నూతన గనులు, తదితర కార్మికుల ప్రధాన సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.గని యాజమాన్యం అవసర నిమిత్తం తీసుకుని పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్ డ్రెస్ కోడ్ ధరించాలని,వారు అధికారులు లాగా కార్మికులతో వ్యవహరిస్తున్నారని,మాన్ వే వద్ద ఇన్,అవుట్ కు రావట్లేదని,ఫోన్ ద్వారానే వారికి ఇన్,అవుట్ వేయడం జరుగుతుందన్నారు.వీరికి యాజమాన్యాన్ని సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ నంబయ్య,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు రవి,రాజేందర్, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,పెద్ది రాజు,చందు,రామకృష్ణ,గని. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.