MIM Slams Nitish Kumar Over Hijab Controversy
తీవ్రంగా ఖండించిన ఎంఐఎం పార్టీ….!
◆-: ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నియమితులైన ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా, ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళా ఆయుష్ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను చూసిన సీఎం నితిష్, దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో కొందరు నవ్విన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కన్పించింది.
ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
మాట్లాడుతూ నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా? లేక ఇప్పుడు ఆయన పూర్తిగా ‘సంఘీ’గా మారిపోయారా? అంటూ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ విమర్శించింది.రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే,రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపిపరు.ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.ఈ దుర్మార్గం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు,
