MIM and Congress Leaders Join Jubilee Hills Campaign
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం కాంగ్రెస్ నాయకులు
◆:- ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దిన్
◆:- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దిన్ గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ
నవంబర్ 11న జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి, తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి బలం చేకూరుతుంది, అని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ,తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.ఈసమావేశంలో నర్సపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల.రాజిరెడ్డి మరియు షేక్ పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
