నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తిరుమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి అధ్యక్షతన..
ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . తిరుమలాపురం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ,పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళలకు నిరుద్యోగులకు ,రైతులకు ,కూలీలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్ రేవంత్ రెడ్డి
కి దక్కింది , అలాగేభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* గెలిచి 15 నెలలు గడిచిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడు.. రోజుకు 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు….. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి పేదలను అదుకునే దిశగా కృషి చేస్తున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి గ్రామ సీనియర్ నాయకులు గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, బొంపల్లి కిషన్ ,కంచర్ల కిట్టయ్య, కొర్రి రాజు ఎళగొండ శ్రీకాంత్, కలవేణి ప్రవీణ్,చెన్న నిశాంత్, నాగిరెడ్డి శంకర్, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, గద్దల తిరుపతి, నీలేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .