యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,పోన్నం ప్రభాకర్ కి దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఎన్నడ లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో 6000 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకం కింద 5లక్షల యువత యువకులకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆర్థిక సహకారం అందించడానికి ఈ పథకం క్రింద ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో శాసన సభ లో బిల్లునీ ప్రవేశ పెట్టిన తీర్మానించి ఆమోదించినందున తెలంగాణా ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ తక్కలపెళ్లి స్వర్ణలత,సమన్వయ కమిటీ సభ్యులు సొద రామకృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్ కుమార్,యూత్ నాయకులు బొచ్చు జెమిని,మంద వెంకటేష్,బొచ్చు రాజు,బోజ్జం అనిల్,దాసరి దిలీప్,ఇనుముల రాము,సిలివేర్ తిరుపతి,అముదలపెళ్లి రమేష్,శివ కుమార్,అరుణ్,సురేష్,నరేష్, తిక్క అఖిల్ తదితరులు పాల్గొన్నారు.