
Grand Milad un Nabi Rally in Zaheerabad
ఘనంగా ‘మిలాద్ ఉన్ నబీ’ ర్యాలీ….
◆:- ఏడుగురి నిరుపేద యువతి యువకులకు వివాహాలు
◆:- వాడవాడలో రక్తదాన శిబిరాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబి సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో శాంతియుతంగా ర్యాలీలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గంలో మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా స్థానిక ఈద్గా మైదానం నందు ఏడు మంది నిరుపేద యువతి యువకులకు సామూహిక వివాహాలు జరిపించారు. పట్టణంలోని శాంతినగర్, ఫరీదనగర్, రామ్ నగర్, డ్రైవర్ కాలనీ, ఐడీఎస్ఎంటి కాలనీ, అహ్మద్ నగర్ కాలనీ, మోమిన్ మహేళాలలో ర్యాలీలు నర్వహించి రక్తదాన వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ తంజీం, సయ్యద్ మోహియోద్దీన్, షేక్ ఫరీద్ లు హాజరయ్యారు. నూతన వధూవరుల కుటుంబ సభ్యులకు బడి బాసన్లు అన్నిటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే జహీరాబాద్ పట్టణానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండగలు జరుపుకొంటారన్నారు. జహీరాబాద్ మిలాద్ కమిటీ వివాహాల కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద వధూవరులకు వివాహాలు జరిపించడం ఎంతో హర్షించదగ్గ విషయమ న్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నటువంటి వారందరికీ సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లాస్ట్ (డెడ్ ఎండ్) లో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాహిన్ నగర్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు, హిందూ సోదరులు సైతం స్వచ్చందంగా రక్తదానం చేసి తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్బాస్, షేక్ అయూబ్, షేక్ అలీ, షేక్ ముఖీన్, షేక్ అబేద్, షఫీ పటేల్, మొహ్మద్ బాబా పటేల్, జాఫర్, ఎం డి. మస్తాన్ వివాహాల కమిటీ అధ్యక్షులు గోరెమియా సికందర్, తదితరులు పాల్గొన్నారు.