
Flood water overflowing
అర్ధరాత్రి కుండపోత వర్షం.
#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.
#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.
#మత్తడి దూకుతున్న పలు చెరువులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.