అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ…
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ లో బి.ఆర్.ఎస్వీ నాయకుల అక్రమ నిర్బంధం…విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి బయల్దేరిన బి.ఆర్.ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జహీరాబాద్ పోలీసులు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు..
బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి రాకేష్…

జహీరాబాద్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ రాకేష్ మాట్లాడుతూ సీ.ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి డుమ్మా కొట్టడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ఎగవేసి విద్యార్థులను మోసం చేశాడు అని ద్వజమెత్తారు. అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మహిళా విద్యార్థినిలకు స్కూటీల పేరు చెప్పి ఓట్లు దండుకుని నేడు వారికి బడ్జెట్ లో కనీసం వారీ ప్రస్తావన సైతం తీయలేదని ఎద్దవ చేశారు. మరి ముఖ్యంగా అనగారిన విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్వీ ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యి పట్టున పది రోజులు గడువక ముందే ఇప్పటి అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టులు చేసి నిర్బంధకాండ సృష్టిస్తున్నారని అన్నారు. ఈలాంటి కాంగ్రెస్ ప్రజాపాలన చూస్తే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా సాగుతుందని ఎద్దేవా చేశారు.జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ అరెస్టులు తక్షణమే మానుకోలవని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల జోలికి వొచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవని విధ్యార్థులు జోలికి వొస్తే ఊరుకోబోమని బీ.ఆర్.ఎస్వీ తరపున పోరాటం ఉదృతం చేస్తాం అని ముందస్తు అరెస్టులు ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వన్ని కోరారు. ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి విద్యార్థులను అరెస్టు చేయడాలను ఆపాలని హెచ్చరించారు . ఈ సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ , బీ.ఆర్.ఎస్వీ న్యాల్కాల్ మండల అధ్యక్షులు జెట్గొండ మారుతి యాదవ్ , సీనియర్ బీ.ఆర్.ఎస్వీ నాయకులు పరశురాం , ఎం.డీ ఫయాజ్ , రఘు తేజ , ఆవేజ్ , అజీమ్ , ఇక్బాల్ , మహేష్ , రజాక్, మరియు తదితరులు పాల్గొన్నారు.