కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…
మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలు జీతం ఇస్తామని జీవొ విడుదల చేశారని అవి జీవోలు గాని మిగులుతున్నాయని అవి ఇంతవరకూ జమ చేయలేదని వారన్నారు గత రెండు సంవత్సరాలుగా జీతం పెంచుతున్నామని ఊరిస్తున్నారు తప్ప అవి జమైన దాఖలాలు లేవని మధ్యాహ్న కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, పెంచిన జీతాలు ఇవ్వకుండా కొత్తగా మెనూ అమలు చేయాలని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ఉదయం పూట టిఫిన్, రాగి జావా మధ్యాహ్నం భోజనం లతో పని భారం పెరుగుతుందే తప్ప తమ జీతాలు, బిల్లులపై ప్రభుత్వం పట్టించుకున్నది లేదని తక్షణమే పెండింగ్ విడుదల చేసి పెరిగిన ధరలు కనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, పెంచిన జీతం ఏరియర్స్ తో సహా చెల్లించాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే టెండర్ విధానం ద్వారా సరఫరా చేయాలని, యూనిఫామ్, వంట పాత్రలు ప్రభుత్వం సరఫరా చేయాలని సమస్యలతో కూడిన వినతి పత్రం స్థానిక తాసిల్దార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో బోండ్ల రమాదేవి, కొమరం మల్లమ్మ,గొగ్గల సావిత్రీ,ఆవుదొడ్డీ మంగమ్మ,కాలం వెంకట నరసమ్మ, గొంది ఈశ్వరి, ఢిల్లీ లక్ష్మీబాయి , పాయం శాంత,కోరగట్ల జయలలిత తదితరులు పాల్గొన్నారు