మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది “శ్రమదానం
మెట్ పల్లి జనవరి 24 నేటి ధాత్రి
సోమవారం జరుగనున్న “రిపబ్లిక్ డే” ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య నేతృత్వంలో వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న అధ్వర్యంలో శనివారం రోజున కళాశాల సిబ్బంది శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై అమర్చిన కళాశాల బోర్డు నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోనికి వెళ్ళే రోడ్డుపై పెరిగిన గడ్డి, ముళ్ళ చెట్లు తదితర పిచ్చి మొక్కలతో పాటు చెత్త, చెదరాన్ని పారలు,గడ్డ పారలు,గొడ్డలి,ప్లాస్టిక్ బుట్టలు వంటి పరికరాల సహాయంతో శుభ్రం చేశారు.దాంతో ఈ ప్రాంతమంతా ఆకర్షణీయంగా తయారయ్యింది. అనంతరం చెత్త, చెదారానికి సిబ్బంది నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్.ఓ. డి.మనోజ్ కుమార్ బోధనా సిబ్బంది అంజయ్య, శ్రీకాంత్, దశరథం లతో పాటు బోధనేతర సిబ్బంది లక్మినారాయణ, బాబు, శ్రీనివాస్, లక్ష్మి, లింగం తదితరులు పాల్గొన్నారు.
