
MRC Messengers Demand Fair Pay
చాలీచాలని వేతనాలతో నలిగిపోతున్న మెసెంజర్లు
జీవోల ప్రకారం వేతనం పెరగకపోవడంతో నష్టపోతున్నాం
తెలంగాణ రాష్ట్ర ఎం ఆర్ సి మెసెంజర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి… భాను బిక్షపతి
కేసముద్రం/ నేటి ధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi
జీవో నెంబర్. 60 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ క్రింద వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెంచిన వేతనాలను విద్యాశాఖ మండల విద్యా వనరుల కేంద్రం ఎం ఆర్ సి / ఎంఈఓ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 467 మంది గత 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మెస్సెంజర్ కమ్ అటెండర్ లకు కూడా వర్తింప చేయాలని,
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి) ( ఎంఈఓ కార్యాలయాల్లో మెసెంజర్స్ పని చేస్తున్నామని. వారికి ప్రభుత్వం వేతనాలు ఈ (కింది విధంగా చెల్లిస్తూ వస్తుందని. కాలక్రమంలో వారి వేతనాల పెంపు ప్రభుత్వం నిర్ణయించినట్లు జరగకుండా విధ్యాశాఖాదికారులు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని. కావున ఒకసారి ఈ (కింది విషయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ ఎం ఎస్ నెంబర్ 3 12/01/2011 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఆఫీస్ సబార్టినేట్ / మెసెంజర్ లకు వేతనం రూ.6700/- గా రావాలి కానీ ప్రభుత్వం కేవలం 2500/- మాత్రమే నామమాత్రంగానే ఇచ్చి.
దీని తర్వాత సర్వ శిక్షా అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఆర్ సి నెంబర్1259/2011 (పకారం వేతనాలు రూ. 4500 గా మాత్రమే పెంచారని.
మరుసటి సంవత్సరం ఆర్ సి నెంబర్. 6244/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 9/2012, 22/09/2012 లో రూ 4500 నుండి రూ 6000 గా మాత్రమే పెంచారని, ఇక్కడా మెసెంజర్ లకు వేతనాల పెంపు సరిగా జరగలేదని, అనేక విజ్ఞాపనల అనంతరం ఆర్ సి 660/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 2/2013,: 05/02/2014 లో రూ 6000 నుండి 7500 గా మాత్రమే పెంచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ జీవో ఎంఎస్ నెంబర్.14, ది: 19/02/2016 ఆఫీస్ సబార్టినేట్లకు వేతనం రూ. 12000/- గా ప్రభుత్వం
నిర్ణయించింది మునుపటి వరకు అన్ని దశల్లో వేతనాల పెంపు ఒకే విధంగా జరిగినా, జీవో ఎంఎస్ నెంబర్. 14 లో మాత్రం మెసెంజర్లకు వేతనాలు రూ. 12000/- ఉండాల్సింది పోయి కేవలం 7500/- నుండి 8000/- మాత్రమే పెంచి తీవ్ర అన్యాయానికి గురి అయ్యామని. ఇక్కడ వేతనాల పెంపు అందరికి ఒకేలా జరగలేదని. దీన్ని మెసెంజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎందరో అధికారులకు మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోలేదని. దాదాపు నెలకు రూ. 4000/- జీతాన్ని మెసెంజర్లు నష్ట పోయారు. తర్వాత జి ఓ. ఆర్ టి, నెంబర్ 144,.31/08/2017లో 8000/- నుండి రూ. 8500/- మాత్రమే పెంచారు.
మరలా కొత్త వేతనాల సవరణ ఉత్తర్వుల ప్రకారం జీవో ఎంఎస్ 60 తేదీ: 11/02/2021 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ జీవో. విడుదల చేసింది ఇక్కడా ఆఫీస్ సబార్టినేట్ల వేతనాలు 30% పెంచుతూ రూ. 15600/- గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం మెసెంజర్ల వేతనాలు రూ.8500/- ల నుండి రూ. 11050/- గా మాత్రమే పెంచుతూ తీవ్ర అన్యాయానికి గురి చేశారని. ఈ జి ఓ. లో పేర్కొన్న విధంగా అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు సక్రమంగా పెంచారు. కానీ మెసెంజర్లకు మాత్రం వేతనాలు సరిగా పెంచలేదని. దాదాపు నెలకు 4000/-రూ. వేతనం నష్ట పోతున్నారని. ఇట్టి నష్టాన్ని నివారించాలని కోరుతూ ఎందరి చుట్టూ తిరిగిన ఫలితం కనబడటం లేదని. భవిష్యత్ లో కూడా వేతనాల పెంపులో అన్యాయం జరిగేలా ఉందని. కావున ఇట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు.
గత నాలుగు సంవత్సరాల నుండి పెరిగిన వేతనం అమలు కాక నష్ట నష్టపోయాం, పెరిగిన నితావసరాల ధరలకు అనుగుణంగా మాకు జీవో ఎంఎస్.60, తేదీ. 11/06/2021 నుండి పెరిగిన వేతనం అమలు చేయాలని. మండల విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మలు అయిన మండల విద్యా వనరుల కేంద్రం ఎం.ఆర్.సి లో పనిచేస్తున్న మెసెంజర్లు స్వీపర్లుగా,అటెండర్లుగా అవసరమైతే నైట్ వాచ్మెన్లుగా కూడా బాధ్యతలు నిర్వహించవలసి వస్తున్నదని. చాలీచాలని వేతనంతో బతుకీడుస్తున్న మాకు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ. 15,600/- లుగా పెంచినట్లయితే మా జీవితాలు బాగుపడతాయని. 15 సంవత్సరాలుగా జీవోల ప్రకారం గౌరవ వేతనం పెరగకపోవడం వలన నష్టపోతున్నామని ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇట్టి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నామని అన్నారు