Bhuvanapalli Collector Extends Christmas Greetings
జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగని కలెక్టర్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవాభావంతో మానవత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్న విషయాలను క్రీస్తు బోధనలు తెలియచేస్తాయని తెలిపారు. జిల్లా ప్రజలంతా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని, పరస్పర సౌహార్దంతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ప్రజలకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు.
