వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని సీఐఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రార్ధన మందిరానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొని కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవా లని క్రీస్తు బోధనలు ఆచరణీ యమని, కరుణ, ప్రేమ, సహనం, దయ, త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి మహోన్నతమైన సందేశాలు అందించారు. అలాగే యేసుక్రీస్తు రాకడలో ఆయనతో నడిచే విధంగా ఉండాలని మానవాళిని సత్యం మార్గం జీవం అనే మార్గ నిర్దేశం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ,మారపేల్లి రవీందర్, పోలపెల్లీ శ్రీనివాసరెడ్డి, చల్లా చక్రపాణి,చిందం రవి, మార్కండేయ , బాసని రవి-శాంత, దుబాసి కృష్ణమూర్తి, చర్చి పాస్టర్ అనిల్ , యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ మార పెల్లీ రఘువర్మ ,చర్చి సంఘ పెద్దలు, సంఘ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.