
MEO Negligence Sparks RTI Row in Parakala
సమాచారం అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ
55రోజులు గడుస్తున్నా అందని సమాచారం
బిఎస్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్
పరకాల నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రయివేట్ పాఠశాల సమాచారం కోరగా పరకాల ఎంఈఓ రమాదేవినీ కోరగా ఇప్పటివరకు దాదాపు 55 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్ అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఈఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు రెండు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉండటం లేదన్నారు.సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.