#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓర్రె మల్లయ్య కుమారుడు అజయ్ వయసు (26) గొర్రెలకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే అజయ్ ఆరు నెలల నుండి ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ మానసికంగా కృంగిపోయి ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు లేని సమయంలో గొర్లకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. అజయ్ తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.