నేటిధాత్రి పోచంమైదాన్
క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో గురువారం స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి సత్యనారాయణ క్రీడలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, క్రీడలు ఆడటం వల్ల విద్యార్థులకు కలిగే భౌతిక ప్రయోజనాలు లెక్కలేనన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో అనేక శారీరక కార్యకలాపాలు కీలకపాత్రను వహిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం ఒయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జెఏఎస్ పరంజ్యోతి మాట్లాడుతూ క్రీడలు మానసిక శక్తిని కొత్తపుంతలు తొక్కడంతో పాటు మనోరంజక సాధనాలతో ముఖ్య భాగమై పోయిందని సంప్రదాయకమైన ఆటలు కూడా ఆధునిక ప్రపంచ గుర్తింపు గల పోటీ ఆటలలో ప్రావీణ్యం సంపాదిస్తే పేరు ప్రతిష్టలతో పాటు మంచి ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ట్రస్మా నాయకులు బిల్ల రవి, జ్ఞానేశ్వర్ సింగ్, వివిధ పాఠశాలల ప్రధానోపోధ్యాయులు షణ్ముఖాచారి, శ్యామ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.