భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జి.వి.రామిరెడ్డి.
డిసెంబర్ 16 నుంచి 20 వరకు ఢిల్లీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్ లో తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి పోటీ చేసిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ గిరిజన క్రీడాకారుడు మోడెం వంశీ, 66 కేజీల విభాగంలో, బంగారు పతకాలు తో పాటుగా స్ట్రాంగ్ మెన్ టైటిల్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది.స్క్వాట్స్ విభాగంలో 315 కేజీలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 150 కేజీలు, డెడ్ లిఫ్ట్ విభాగంలో 252.5 కేజీలు బరువెత్తి, మూడు బంగారు పతకాలు తో పాటుగా మొత్తంగా 717.5 కేజీల బరువును మోసి స్ట్రాంగ్ మెన్ టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటుగా ఓవరాల్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. గిరిజన క్రీడాకారుడు మోడెం వంశీ, గతంలో కూడా మాల్టలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు మరియు సౌత్ ఆఫ్రికా లో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకాలు సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిప్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జి.వి.రామిరెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ గిరిజన క్రీడాకారుడు మోడెం వంశీని భద్రాచలం, అంబేద్కర్ సెంటర్ లోని సిటీ స్టైల్ జిమ్ నందు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు మరియు భద్రాచలం డాక్టర్లు అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ జీవి రామిరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ మిమ్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ గురు తేజ,డాక్టర్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.