వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన ఇస్లాం నగర్(నాంపల్లి)కి చెందిన గ్లోబల్ యూత్ సభ్యులు సుమారు 60మంది మంగళవారం రాత్రి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యూత్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడు రూమ్ ఇండ్లతో పాటు సంక్షేమ పథకాల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చల్మెడను కోరారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ యూత్ సభ్యులు కోరిన విధంగా తాను గెలిచిన వెంటనే ఇస్లాం నగర్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల్లో మైనార్టీ సోదరులకు తగిన ప్రాధాన్యం ఉండేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, ఇస్లాం నగర్ గ్లోబల్ యూత్ అధ్యక్షుడు అబ్దుల్ రహామాన్, సభ్యులు అబ్దుల్ ఖలీద్, షేక్ చాంద్ మియా, షేక్ అక్బర్, సయ్యద్ అబ్దుల్ రషీద్, సయ్యద్ సాజీర్, షేక్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
చల్మెడకు మద్దత్తు తెలిపిన ఇస్లాం నగర్ గ్లోబల్ యూత్ సభ్యులు
