వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అట్లాగే కోనరావుపేట మండలానికి చెందిన వడ్డెర సంఘం సభ్యులు పలువురు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరి, చల్మెడకు మద్దతు తెలుపుతామంటూ హామీ ఇచ్చారు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంబటి చంద్ర మౌళి, ఉపాధ్యక్షుడు బొయిని శ్రీనివాస్ లు చల్మెడ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.