భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్అసోసియేషన్
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశి, 21 సంవత్సరాలు, అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భారతదేశానికి బంగారు పతకం సాధించడం జరిగింది. వచ్చే అక్టోబర్ నెల 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ పోటీలకు తెలంగాణ తరుపున భారతదేశానికి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ పోటీలకు రానుపోను మరియు వీసా ఖర్చులకు గాను, రెండు లక్షల రూపాయలను పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా కు చెల్లించవలసి ఉంది.ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనుటకు రెండు లక్షల 50వేల రూపాయలు అవసరమవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి అతనికి సమకూర్చి పంపించడం జరిగింది. ఈసారి సౌత్ ఆఫ్రికా లో జరిగే పోటీల కోసం అవసరమయ్యే రెండు లక్షల రూపాయలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డీ ని కలిసి అభ్యర్థించి నివేదించటం జరిగింది.నీకూ తప్పకుండా ఆర్ధిక సాయం చేస్తాము, నువ్వూ మాత్రం సౌతాఫ్రికా లో జరగబోయే కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ లో తెలంగాణ కు గోల్డ్ మెడల్ తీసుకుని రావాలని శివసేనా రెడ్డీ మోడెం వంశీని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, కోశాధికారి మహంతి కృష్ణాజి (నేషనల్ పవర్ లిఫ్టర్) మోడెం వంశీ( ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది