
Melania Trump
అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, హంటర్ బైడెన్‌పై 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారం కోసం కోర్టు కేసు వేస్తానని హెచ్చరించారు.
హంటర్ బైడెన్, మెలానియాను జెఫ్రీ ఎప్స్టైన్ డొనాల్డ్ ట్రంప్‌కు పరిచయం చేశారని చేసిన వ్యాఖ్యలపై ఆమె న్యాయవాదులు ఈ చర్యకు దిగుతున్నారు. ఈ వ్యాఖ్యలు “అసత్యం, అవమానకరం, అపకీర్తికరం” అని మెలానియా న్యాయవాదులు పేర్కొన్నారు.
హంటర్ బైడెన్, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఎప్‌స్టైన్‌కు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న పాత పరిచయాన్ని విమర్శిస్తూ, మెలానియాకు ఆయన పరిచయం చేసినట్లు ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, సంబంధిత పత్రిక కూడా ఆ కథనాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు తెలిపిందని మెలానియా న్యాయవాదులు స్పష్టం చేశారు.
మెలానియా, 1998లో న్యూయార్క్‌లో జరిగిన ఒక పార్టీ లో ట్రంప్‌ను కలిశారని పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వివాదం, ఎప్స్టైన్ కేసుకు సంబంధించిన పత్రాలు విడుదల చేయాలన్న ఒత్తిడి మధ్య చెలరేగింది.