
FLN–TLM Mela at Kuppanagar High School
కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ – టిఎల్ఎం మేళా
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం లోని కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం మేళా కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి( ఎంఈఓ ) మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులు అందరూ బోధనోపకరణాలతో పాల్గొని విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, అంజనేయులు, విష్ణు వర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావులు మాట్లాడుతూ వివిధ విషయాలు తెలుసుకుని విద్యార్థుల అభివృద్ధికై కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో ఎఫ్ ఎల్ ఎన్ ( ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం బోధనోపకణాల పట్ల అన్ని అంశాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మండలం నుండి ఉత్తమ బోధనోపకణాలు( టిఎల్ఎం ) ప్రదర్శించిన ఉపాధ్యాయుల వివరాలు జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. ఈ మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీ ఆర్ పీ లు పాల్గొన్నారు.