రామడుగు, నేటిధాత్రి:
గావ్ ఛలో అభియాన్ (పల్లెకి పోదాం) కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా మండల కేంద్రములోని రాముని అడుగును సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ రాముడు వనవాసంకి వెళ్లిన సందర్భంగా రాముని అడుగు ఇక్కడ వేసినట్లు తెలియజేసారు. ఈరాముని అడుగుని సందర్శించడానికి త్వరలో బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వస్తారని తెలియజేసారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి హిందువుల ఆరాధ్యదైవం అయినటువంటి శ్రీరాముడు వేసిన అడుగుల గురించి తెలిసి కూడా ఇప్పటివరకు సందర్శించకుండా ఎందుకు ఉన్నారో తెలియజేస్తూ, వెంటనే సందర్శించి అభివృద్ధి పనులను ప్రారంభించాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సరస్వతి దేవిని విగ్రహాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకోని, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాముని పరామర్శించడం జరిగినది. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిట్టవేణి అంజిబాబు, బీజేవైఎం మండల అధ్యక్షులు దుర్శేట్టి రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పోచంపల్లి నరేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బీజేవైఎం కార్యదర్శి ఉత్తం కనకరాజ్, ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, బూత్ స్థాయి నాయకులు వేముల శ్రీనివాస్, సింగసాని మల్లేశం, లంకోజి భరత్, అంజయ్య, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.