సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రదీప్ ముదిరాజ్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని “శ్రీ చైతన్య న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెపా జయశంకర్ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మెపా జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని,ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని,ఈ జాబ్ మేళాలో పాల్గొని,పలు కంపెనీల ఇంటర్వ్యూ లో పాల్గొని జాబ్ సాధించాలని, నిరుద్యోగ యువత కష్టనష్టాలను చలించిపోయి, నిరుద్యోగులకు మెపా ఆధ్వర్యంలో పలు జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ,నిరుద్యోగులకు అండగా మెపా ఉంటూ,మెపా ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని మొబైల్ నెంబర్ 9705214964 9701011801 ను సంప్రదించాలని వారు తెలిపారు