మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
భద్రాచలం జడ్జి శివ నాయక్
నేటిదాత్రి చర్ల
చర్ల మండలం లింగాపురం పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు
మెగా హెల్త్ క్యాంప్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భద్రాచలం జడ్జి శివనాయక్
పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో ఉన్న ఏజెన్సీ ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం చేపించుకోలేని స్థితిలో ఉన్నారని అందుకే ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించటం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీవో ఈదయ్య తాసిల్దార్ శ్రీనివాసరావు ఈ మెగా క్యాంపు ఉద్దేశించి మాట్లాడారు పాల్వంచ ఎల్ వి ప్రసాద్ కంటి వైద్యశాల మేనేజర్ దేవి శంకర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో లింగాపురం పాడు గ్రామంలో ఐ క్యాంపు ఏర్పాటు చేపించి చర్ల మండలం లో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు జరిపించి మెరుగైన మందులు కళ్ళజోడులు అందించారు అట్లాగే కొయ్యూరు హస్పటల్ నుండి హోమియోపతి డాక్టర్ గుండెపూడి పూజ రోగులకు మెరుగైన వైద్యం అందించి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులను ప్రజలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లారపు శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పటల్ కి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఇక్కడ మెరుగైన వైద్యం మందులు అందిస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల సబ్ ఇన్స్పెక్టర్ కేశవ్ మాట్లాడుతూ చర్ల మండల ప్రజలు ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఉపయోగించుకొని మెరుగైన వైద్యం పొందాలని ఆయన సూచించారు ఈ మెగా క్యాంప్ ఏర్పాటుచేసిన యువతకి అట్లాగే భద్రాచలం జడ్జి శివ నాయక్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గూగులోత్ మంగ కొత్తపల్లి సర్పంచ్ గంప నాగలక్ష్మి గొంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చార్నీల్ అశోక్ లింగాపురం ఉపసర్పంచ్ తడికల్ నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి గత నాలుగు రోజులుగా నిద్రహారాలు మానేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి బానోతు నరసింహారావు కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి భూక్య శరత్ కొంపల్లి కార్యదర్శి బైరెడ్డి నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన లాయర్ పరిటాల సంతోష్ ఈ కార్యక్రమంలో
సీనియర్ న్యాయవాదులు
అంబేద్కర్ తిరుమలరాజు ఆవులూరి సత్యనారాయణ పేరాల బండారు రమేష్ సాధనపల్లి సతీష్ సంధ్య శారద బండ రామలక్ష్మణ్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
