వైద్య శిభిరాన్ని ప్రారంభించిన డాక్టర్ విజయచెందర్ రెడ్డి,డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ళ గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా 17సెప్టెంబర్ నుండి ఓటిసీ నిర్వహించు సేవ పక్వాడ (సేవ పక్షం)కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి,పరకాల నియోజకవర్గ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రోగులను పరీక్షించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చు విశేష జరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిశుభ్రత మీద మరియు తగు ఆహారా నియమాలను పాటిస్తూ జ్వర తీవ్రతను బట్టి నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు నిర్వహించుకొని విను వెంటనే వైద్యం చేయించుకోవాలని సూచించారు.ఈ ఆరోగ్య శిబిరంలో ఆర్థోపెడిక్ డాక్టర్లు డాక్టర్ విజయ చందర్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్,హనుమకొండ రెడ్ క్రాస్ డాక్టర్లు డా.జి.కిషన్ రావు,డా. మొహమ్మద్ తహర్ మసూద్,భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామ్ రెడ్డి,ముత్యాల శ్రీనివాస్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్,ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్,యాదగిరిరావు,యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల సుమంత్, బూత్ అధ్యక్షులు డెంగు నవీన్,ననబోయిన శ్రీనివాస్ రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,అరువ గంగాధర్, మాందాటి శ్రీకాంత్,పోచాలు తదితరులు పాల్గొన్నారు.