Mega Farmer Demo on Rasi Swift Cotton
రాశి స్విఫ్ట్ పత్తి పంటపై మెగా క్షేత్ర రైతు ప్రదర్శన
పరకాల,నేటిధాత్రి
మండలంలోని వెళ్లంపల్లి గ్రామంలో రహీం పత్తి చేనులో రాశి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టేరిటరీ సేల్స్ మేనేజర్ పవన్ రెడ్డి మాట్లాడుతూ రాశి స్విఫ్ట్ అనే హైబ్రిడ్ పత్తి తొందరగా పంట కాపు వచ్చే రకం అని,రెండో పంట వేసుకొనే రైతులకు అనుకూలం అని,ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎక్కువ కాయలను నిలుపుకొని రైతులకు అత్యధిక దిగుబడిని ఇచ్చే రకమని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వెళ్ళంపల్లి,పోచారం గట్లకానిపర్తి,సీతారాంపురం, కౌకొండ ధర్మారం గ్రామాల నుండి సుమారు 350 మంది రైతులు,డీలర్లు మరియు రాశి కంపనీ పి ఓ శ్రీనివాస్, విజయచందర్,దేవేందర్ లు పాల్గొన్నారు.
