
Velpula Venkatesh.
వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్ కు మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాదులో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేశ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం అని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మాకుటుంబానికి అత్యంత ఆప్తుడని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో ఐదు రోజులపాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టం అన్నారు. చిరంజీవి విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని తెలిపారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మెగా అభిమానులు చిరంజీవి యువత ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువత చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాది మంది చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా వేల్పుల వెంకటేష్ ను వెలిచాల రాజేందర్ అభినందించారు. ఈకార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, ఆకుల నర్సన్న, ఆకుల ఉదయ్, బట్టు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.